ఏమయ్యా శ్రీరామ రామ యనవయ్య
ఆమాటే చాలుచాలని తెలియవయ్య
అమాటను పట్టుకొని హనుమ కూర్చున్నాడు
ఆమాటను పట్టుకొని హరుడు కూర్చున్నాడు
అమాటనె పట్టుకొని యఖిలయోగు లున్నారు
ఆమాటనె నీవు పలుకాడ వేమయ్య
శివుడిచ్చిన మంత్ర మది సేవించవేమయ్య
చవులుగొలుపు మంత్ర మది చదువ విదేమయ్య
భవతారక మంత్ర మని భావించ విదేమయ్య
పవలురేలు చక్కగను పలుకవేమయ్య
వెతలుదీర్చు మంత్ర మది విష్ణుమంత్ర మయ్య
బ్రతుకునిలుపు మంత్ర మది పరమమంత్ర మయ్య
అతిపవిత్రమంత్ర మిది అని తెలుసుకోవయ్య
చతురుడవై నీవును స్మరియించ వయ్య
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.