15, జూన్ 2013, శనివారం

పాహి రామప్రభో - 138

ఉత్సాహము
జయము జయము జయము రామ జానకీ‌మనోహరా
జయము జయము వాసవాదిసర్వదేవవందితా
జయము జయము పార్వతీశసన్నుతా పరంతపా
జయము జయము శ్యామలాంగ సర్వలోకపాలకా

(వ్రాసిన తేదీ: 2013-5-27)

3 వ్యాఖ్యలు:

 1. మాస్టారూ,

  "పాహి" అని వ్రాయాలా ( మీరు labels కి పెట్టినట్టుగా) లేక "పహి" అని ఈవేళ వ్రాసినట్టుగా వ్రాయాలా?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. క్షమించాలి. పాహి అనటమే సరిగా ఉంటుంది. నేటి శీర్షికలో ముద్రారాక్షసానికి విచారిస్తున్నాను. ఇప్పుడే సరిజేసాను.
   ప్రతిరోజూ 'పాహి రామప్రభో' అనే వ్రాస్తున్నానని గమనించ ప్రార్థన.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.