6, ఏప్రిల్ 2015, సోమవారం

తరచుగా ఏకాంతమన్నది దొరకు చున్నదా

తరచుగా ఏకాంతమన్నది దొరకు చున్నదా
తరచుగా శ్రీరామజపము జరుగుచున్నదా

తరచుగా తాపత్రయముల తహతహల రోజు గడచునా
తరచుగా కామాదిరిపుల తాడనంబులు విరచునా
తరచుగా మరి యీతిబాధల పరమవ్యగ్రత కరచునా
తరచుగా నటు లగుచు నున్న దాశరథినే వేడుమా  ॥తరచుగా॥

తరచుగా పదిమంది నడుమ తలచు భాగ్యము కలుగదా
తరచుగా సాస్థ్యంబుదప్పి తనువు బడలుట కలుగునా
తరచుగా మతిమరపుచేత ధ్యానలోపము కలుగునా
తరచుగా నటు లగుచునున్న దాశరథినే వేడుమా  ॥తరచుగా॥

తరచుగా దుర్విద్యలందలి తమిని దినములు గడచునా
తరచుగా డాంబికుల బోధల దారి తప్పుట గలుగునా
తరచుగా ఫలమేమి యనెడు తప్పు బుధ్ధియు గలుగునా
తరచుగా నటు లగుచుచున్న దాశరథినే వేడుమా  ॥తరచుగా॥

2 కామెంట్‌లు:

 1. http://www.harikaalam.blogspot.in/2015/04/blog-post_3.html

  ఈ బీజాక్షర గర్భితమైన ఆంజనేయ దండకం యెలా వుంది మాస్టారూ!
  మాలికలో నా పోష్టుకు సంబంధించినవేనా అసలు యెక్కడి కామెంట్లూ పడటం లేదా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇప్పుడు ప్రొద్దు పోయింది కదా. మీ దండకం రేపు చదవయత్నిస్తాను. మాలిక బిర్రబిగిసి కూర్చుంది. నేను SrInu గారికి మెయిల్ ఇచ్చాను. ఆయన చూసి సరిచేయాలి.

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.