10, ఏప్రిల్ 2015, శుక్రవారం

తెలిసిన వారికి దేవుడవు లేవని పలికే వారికి గుడిలో శిలవు


తెలిసిన వారికి దేవుడవు లేవని
పలికే వారికి గుడిలో శిలవు
ఇమ్మహి కాదర్శమ్మని నీ కథ
ఇమ్ముగ తన చిత్తమ్మున చక్కగ
నమ్మినచో మరి నారాయణుడవు
నమ్మకున్నచో నవ్వుకొందువు
తెలిసినతడబడకను  సధ్ధర్మపథంబున
నుడువులు నీయవి నడిపిన రీతిని
నడచినచో మరి నారాయణుడవు
నడువకున్నచో నవ్వుకొందువు
తెలిసినఘోరభవాబ్ధినిమగ్నుండొక్కడు
తారణనౌకవుగా తలచినచో
శ్రీరాముడవు నారాయణుడవు
వేరని తలచిన నవ్వుకొందువు
తెలిసిన