నే నుంటి నందునా నీవుంటి వందునా
నేనె నీ వందునా నిజమేమి టందునా
శ్రీరామ నిజమెన్న జీవరాసుల కెపుడు
తారుండు విధమైన తెలియరాకుండు
ఏ రీతి పరతత్త్వ పారమ్యమును గూర్చి
గోరంతయును పోల్చుకొనవచ్చు గాన ॥ నే నుంటి॥
జానకీరమణ నీ చరణాంబురుహములను
పూని గొల్చెదగాన బుధ్ధిలో కొంత
నేను నీ వాడనను ఙ్ఞానలేశంబు
మానక కలుగెనే మరియందు చేత ॥నే నుంటి॥
తొడిగిన తొడగులు తొడగక కొన్ని
తొడిగిన వంటివే తొడుగుచు కొన్ని
ఉడిగితి తుదకు నా యున్కిపై భ్రాంతి
కడకు నీ యందె నే కలసితి గాన ॥నే నుంటి॥
15, ఏప్రిల్ 2015, బుధవారం
1 కామెంట్:
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
శ్యామలీయం గారు మీ టపాలు చదువుతు ఉంటాను.శ్యామలీయం భాగవతం చదివాను అదే ఉత్సాహంతో ఊలపల్లి సంబసివ రావు గారి పోతన తెలుగు భాగవతం చదువుతున్నాను.వీలయితే నాకు ఒక చిన్న సహాయం చేయాలి అండి.నేను శ్రీరామకర్నామృతం శ్లోకాలు కోసం చాల రోజుల నుండి చూస్తున్నాను. మీ దగ్గర ఉంటే నాకు మెయిల్ కి పంపించమని కోరుతున్నాను. నా మెయిల్
రిప్లయితొలగించండిravipatirayudu@gmail.com
ఈ రోజు మీ టపా చూసాక అడగాలనిపించి అడుగుతున్నాను
అనేక ధన్యవాదాలు
సర్వారాయుడు రావిపాటి