7, ఏప్రిల్ 2015, మంగళవారం

పరమభాగవతులు రామభజనకు రండు






పరమభాగవతులు రామభజనకు రండు
పరమపురుషుడైన చక్రి భజనకు రండు




నోరారగ మనసు కరువుతీర పాడ రండు
శ్రీరాముని పొగడిపొగడి సేదతీర రండు
మీ రెరిగిన కృతులు విభుడు మెచ్చ పాడ రండు
చేరి మనము రామభజన చేయ వచ్చు రండు 
పరమ



పోచికోలు కబురులతో ప్రొద్దుపుచ్చనేల
రాచకార్యమేముండును రాత్రిపూట మీకు
వాచవియట రామభజన వాసవాదులకైన
లేచి రండు భజనచేయ లేచి రండు వేగ
పరమ



రామభజనతో గోపరాజు ముక్తి నొందె
రామభజనతో త్యాగరాజు ముక్తి నొందె
రామభజనతో హనుమ బ్రహ్మపదము నొందె
రామభజనతో పొందరాని దేమిగలదు
పరమ






5 కామెంట్‌లు:

  1. రామకీర్తన భక్తిస్ఫోరకముగా ఉన్నది. అభినందనలు.

    మరొక విషయం...మీరు గతంలో శంకరాభరణంలో ఒక తెలుగు కీబోర్డు గురించి తెలిపియున్నారు. నేను దానిని bookmarkలో పెట్టుకున్నాను. కాని, కొన్ని కారణాంతరాలవల్ల అది తొలగిపోయింది. ఇప్పుడు దాని అవసరం వచ్చింది. కాని అది ఏ కీబోర్డో జ్ఞాపకంలేదు. తాము దయతో తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను విండోస్‌లో వాడే తెలుగు కీబోర్డ్ http://vishalon.net/PramukhIME/Windows.aspx లింక్ వద్ద ఉంది. అది ప్రముఖ్. వాడుక చాలా తేలిక. తెలుగుతో సహా ఇరవై భారతీయ భాషల్ని దీని ద్వారా వాడుకోవచ్చును.

      (అన్నట్లు దాని గురించిన సమాచారం ఇక్కడే కందపద్యం క్రిందనే ఇచ్చాను. మీరు గమనించలేదు!)

      తొలగించండి
    2. ప్రముఖ్ వాడడం తేలికగా ఉన్నది. అయితే దీనిని ఎప్పటికపుడు ఫోల్డర్ నుండి ఓపెన్ చేయాల్సి వస్తున్నది. అలా కాక ఇనిస్టాల్ చేసుకోవచ్చా?

      తొలగించండి
    3. కొండలరావుగారూ, ప్రముఖ్ అప్లికేషన్ యొక్క షార్ట్‍కట్ ఒకటి డెస్కుటాప్ మీద ఉంచండి. అది ఓపెన్ చేస్తే సరిపోతుంది. నేను అలాగే చేస్తున్నాను.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.