24, ఏప్రిల్ 2015, శుక్రవారం

ముక్కోటి దేవతలే మ్రొక్కుచున్నారయా


ముక్కోటి దేవతలే మ్రొక్కుచున్నారయా
అక్కటా నీవు నమ్మనందువలన లోపమా
నమ్మవయ్య రాముడు నారాయణుడు నీవు
నమ్మకున్న కూడ నతడు నారాయణుడే
నమ్మినందు వలన రామునకు లాభమా నీవు
నమ్మకున్న రామునకు నష్టమున్నదా  
ముక్కోటికాముడు నీవాడుగా కనిపించునా నీకు
రాముడు పెఱవాడుగా ననిపించునా
ఏమి దుష్కర్మమో ఏమార్చగా నీకు
స్వామిపై నమ్మకము సంభవమేనా      
ముక్కోటిరామునికృప నీపైన రాకూడదా నీకు
రామునిపై భక్తి కలుగరాదా నేడే
ప్రేమమయునకు నీవు బిడ్డవు కావా నీకు
నామాటలు చేదైతే నేమి చేసెద   
ముక్కోటి