13, ఏప్రిల్ 2015, సోమవారం

తపము తపమంటా రదేమయ్యా


తపము తపమంటా రదేమయ్యా మరి యా
తపము వలన ఫలిత మేమయ్యా
తపము తపమన ధర్మపరుడై దాశరథినే నమ్మియుండుట
తపసి వెన్నుగాచి యుండుట దాని ఫలితము తెలిసికొనుము   
తపముతపము తపమన యెల్లవేళల దాశరథినే తాను కొలుచుట
అపజయమ్ము లేక కోరిక లన్ని తీరుట దాని ఫలము         
తపముతపము తపమన రామధ్యానము దాని ఫలితము బ్రహ్మఙ్ఞానము
తపము చేసి ఙ్ఞానియై పరతత్త్వమందే తాను కలియును          
తపము