29, ఏప్రిల్ 2015, బుధవారం

కాలం చేసే గారడి నేను చాలా చూసానుకాలం చేసే గారడి నేను చాలా చూసాను
కాలాతీతుని రాముని నాలో మేలుగ తలచాను 

కన్నులు తెరచిన తొలినాడే నే కలినే చూసాను
కలిమాయలలో చిక్కిన జనులు కలగుట చూసాను
కలగిన మనసులు సత్యపథమ్మును తొలగుట చూసాను
తొలగిన బేలలు చీకటులందు తిరుగుట చూసాను
॥కాలం చేసే॥
మాయామయమగు జగమును నమ్మే మనుజుల చూసాను
కాయమె తానని తలచే వారల కష్టము చూసాను
ప్రేయోమార్గము వెంట మనుషుల పరుగులు చూసాను
శ్రేయోమార్గము గలదని తెలియని జనులను చూసాను
॥కాలం చేసే॥
అక్కడక్కడ భ్రమలు తొలగిన అనఘుల చూసాను
చక్కగ రాముని నమ్మిన మనసుల సౌఖ్యము చూసాను
అక్కజముగ శ్రీరాముడు వారికి దక్కుట చూసాను
మిక్కిలి ప్రేముడి కొలిచి రాముని దయనే చూసాను 
॥కాలం చేసే॥కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.