5, ఏప్రిల్ 2015, ఆదివారం

తానుండు నన్నాళ్ళె తనది తనువు


తానుండు నన్నాళ్ళె తన దీతనువు
తాను తొలగిన నాడు తన కేమి కాదు
తనివార మైపూతల నద్ది ముఱిసేను
తినుటకె పుట్టిన దనునట్లు పెంచేను
తనభోగముల కెంతొ తహతహ లాడేను
తనకాల మఱుదెంచ తానిట్టె వీడేను   
తానుండుకొఱగాని కాసులు కొన్ని గడించేను
మరి మేను శాశ్వతమన్నట్లు బ్రతికేను
ధరనిండ బంధుసంతతి చాల నించేను
తరుణము కాగానె తానిట్టె తరలేను        
తానుండుధీమంతుడు నిజము తెలిసి చరించేను
కామాదుల విడచి రాముని కొలిచేను
రామదాసుడ తిరిగి రానని పలికేను
క్షేమదాయకు నింట  చేరగ తరలేను        
తానుండు