9, ఏప్రిల్ 2015, గురువారం

రామ రామ రామ యనుచు నామభజన చేయుటలో


రామ రామ రామ యనుచు నామభజన చేయుటలో
ఏమి రుచి ఏమి సుఖము ఏమి శాంతి ఓ మనసా
ఆ మాటను కైకసిసుతు డైన విభీషణు డెఱిగి
శ్రీమంతుడు గుణవంతుడు శ్రీరామచంద్రహితుడు
నీమ మొప్ప రఘువరు శుభనామంబు నుపాసించి
భూమి మీద చిరాయువై పొలిచె కీర్తిమంతుడై
రామసామీరియు నిరతంబును రామచంద్రవిభుని మ్రోల
నామజపానందనిమగ్నాంతరంగు డగుచు నుండి
భూమిసుతావరుని మెప్పు పొంది యుప్పొంగు చుండి
యా మహాత్ము డాగామిని యధివసించు బ్రహ్మపదము
రామపరమయోగిగణంబులును పాకశాశనాదిసురలు
సరసిజభవపరమశివులు సతతము కీర్తించునట్టి
పరమపదావహము పతితపావనంబు నై యెసంగు
నిరుపమాన నామ మెఱిగి  నిర్మలశుభనిష్ఠ మెఱయ
రామ