16, ఏప్రిల్ 2015, గురువారం

కనుల జూద మనుకొందునుకనుల జూద మనుకొందును
కనులు చాల వనుకొందును
మనసు పట్టలేని నిన్ను
కనులు పట్ట లేవందును

భావనలో పట్టరాని
పావన మగు భవ్యమూర్తి
ఆ విధమని ఈ విధమని
నీ వైభవ మెన్ని నేను
॥కనుల॥
ఓహోహో‌ నీవే నా
ఊహల నడపించు శక్తి
ఊహింపగరాని నిన్ను
ఊహించును భక్తి  కాన
॥కనుల॥
ఏమో పరమేశుడవో
రాముడవో కృష్ణుడవో
నా మనసున నిలచితివే
నీ మూర్తిని మనసారా
॥కనుల॥