వెన్నుగాచి రామభద్రు డున్నాడుగా నా కెన్నటికి భయమనేదే లేదుగా |
|||
వాసవాదినుతుని మాట వమ్ముగాదుగా రామ దాసకోటి సేమమును వీసమంతగ మోసపుచ్చు నాపదయు మొలకెత్తదుగా వారి జాసనుని సృష్టిలోన జనులార వినుడు |
వెన్ను గాచి | ||
ప్రారబ్ధము నన్ను బట్టి బాధించునే రామ నారాయణపాదసేవనాపరుడ గాన కోరి నేను చేరగనే కోదండరాముని పారిపోయె పాపములు ప్రజలార వినుడు |
వెన్ను గాచి | ||
రాముని వాడ నైతి రాముడు నావాడై నా మనసున నిండి నా కండగ నుండి ప్రేమతో తలగాచి పవలు రేలు తోడై యేమఱక సేమమఱయు నెల్లరిది వినుడు |
వెన్ను గాచ |
||
25, ఏప్రిల్ 2015, శనివారం
వెన్నుగాచి రామభద్రు డున్నాడుగా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.