నిశ్చయముగ శ్రీరామా నీవే కడు ఘనుడవు
ఆశ్చర్య మేమి నారాయణుడవు నీవు
నిశ్చయముగ యోగీంద్రులు నిన్ను ధ్యానింతురు
నిశ్చయముగ జిజ్ఞాసులు నిన్ను వెదకుచుందురు
నిశ్చయముగ నర్ధార్ధులు నిన్ను కోరుచుందురు
నిశ్చయముగ మౌనీంద్రులు నీకై తపియింతురు
నిశ్చయముగ త్రిలోకముల నీవు నడపుచుందువు
నిశ్చయముగ దేవతలును నిన్ను శరణుజొత్తురు
నిశ్చయముగ లోకులెల్ల నిన్ను పొగడుచుందురు
నిశ్చయముగ నీకు సాటి నీవొక్కడ వగుదువు
నిశ్చయముగ తత్త్వజ్ఞులు నిన్ను దర్శింతురు
నిశ్చయముగ సత్పురుషులు నిన్ను పూజింతురు
నిశ్చయముగ సద్భక్తులు నిన్ను సేవింతురు
నిశ్చయముగ వారికెల్ల నీవు ముక్తినిత్తువు