తనువెల్లా శ్రీరాముని తగిలి యున్నది
మనసేమో శ్రీరామమయ మైనది
రామ రామ యనుట కొఱకె రసన యున్నది
ఆమూర్తిని చూచుటకే యక్షు లున్నవి
ఆమూర్తిని చూచుటకే యక్షు లున్నవి
శ్రీరాముని కొలుచుటకే చిత్త మున్నది
ఆరాముని పూజలకే హస్తమున్నది
రాముని కీర్తించుటకే ప్రాణ మున్నది
ఆరాముని పూజలకే హస్తమున్నది
రాముని కీర్తించుటకే ప్రాణ మున్నది
రాముని సేవించుటకే త్రాణ యున్నది
ఆరాముని తలచ బుధ్ధి యమరి యున్నది
ఆరాముని చేరుటకే యాత్మ యున్నది
ఆరాముని చేరుటకే యాత్మ యున్నది