అందుకో శ్రీరామనామ మందుకోవయ్యా భజనా
నందసౌభాగ్యమధురిమ నందుకోవయ్యా
అందుకొని మును భూమిసుతతా నందె లోకమాతృపదము
వందనీయ సుచరితమే వాసికెక్కిను రామకథగా
అందుకే సీతాయాశ్చరిత మనెను తా నాదికవియు
వందయుగములైన వసివాడదా హరినామము
అందుకొని మును దీని మారుతి యందుకొనెను బ్రహ్మపదము
అందుకొని బహురామరాదు లందుకొనిరి మోక్షపదము
అందుకొని నీవిపుడువేగమె అందుకొనవయ్య బ్రహ్మా
నందమే మరి దానికన్నను పొందదగిన దున్నదా
అందుకొని మును నీవు పలికి నందుకే ఈజన్మలో
ఇందువదను డైన రాముని యందు నీకు భక్తికలిగె
ఎందుకిక నీ వాలసింతువు ఇష్టకామ్యము మోక్షమే
అందుకొనగ నోరువిప్పి ఆలపించవె చక్కగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.