16, మే 2021, ఆదివారం

కల యొక్కటి వచ్చిపది

కల యొక్కటి వచ్చినది కరిగి మరుగైపోయినది

తొలగిపోవుదాక యిది కలయే యని తెలియనిది


పంచషష్టివత్సరములు మంచిగా నడచినది

ఇంచుకసేపటిలో యిట్టే కరిగిపోయినది

మంచిమంచి జ్ఞాపకాలు మాత్రము మిగిలించినది

అంచితముగ నాజీవితమంతా పరచుకొన్నది


ఇంతమంచి కలనిచ్చి యెంతో సంతోషమిచ్చి

అంతలోనె దెబ్బకొట్టి ఆడుకొనుట మంచిదా

కొంతమంచి కొంతచెడుగు కూడినదే జీవితమా

పంతగించి యింతచేసినవాడా నిన్నేమందును


కలయెంత మంచిదైనా కరగిపోక తప్పునా

కల కరిగిపోయెనని పలవరించుట మంచిదా

వలదు మోహపాశమనుచు భావించి ఓరాముడా

కలగించితివా కష్టము కానీరా నీయిష్టముకామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.