శ్రీరామ రామ సీతారమణ
ధారాధరశ్యామ దయాభరణ
ఈరేడు లోకాల కేలికవు నీవు
కారుణ్యమెంతేని కలవాడవు
నోరార నీపేరు నుడివిన చాలు
కోరినమోక్షమే కొంగుబంగారు
మ్రొక్కినవారికెల్ల మోహబంధములను
చక్కగా తొలగించ జాలువాడ
మ్రొక్కువాడ గానా మొరలేలవినవు
చిక్కులింక చాలురా చక్కనయ్యా
దేవాధిదేవ నీ దివ్యకృపామృతము
సేవింపగోరుదురా చింతదీర్చి
నీవు నావాడవై నిలచినచాలును
రావయ్య కావగా రామచంద్ర
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.