రాముని స్మరించవే మనసా రాముని స్మరించవే
ఏమని యితరుల నెన్ని చెడెదవే రాముని స్మరించవే
రాతిని నాతిని చేసిన రాముని నమ్మక యితరుల నమ్మెదవా
కోతిని బ్రహ్మను చేసిన రాముని కొలువక యితరుల కొలిచెదవా
ధాతయె పొగడిన రాముని పొగడక తలకొని యితరుల పొగడెదవా
నీతివిశాలుని రాముని పొగడక నీచమానవుల పొగడెదవా
ప్రేమగ బంటుల నేలెడి రాముని విడచి యితరుల కొలిచెదవా
భీమపరాక్రము రాముని విడచి వీఱిడి నరులను కొలిచెదవా
కామవిరోధి పొగడెడు రాముని కాదని యితరుల పొగడెదవా
స్వామిని పురుషోత్తముని రాముని వదలి పామరుల పొగడెదవా
ఎన్ని జన్మముల నెందర గొలిచిన నిందే తిరుగుచు నుందువుగా
ఎన్ని రాఘవుని తిన్నగ గొలువక నెన్నడు మోక్షము లేదు కదా
అన్ని యాశలను అన్ని మోహముల అన్ని బంధముల విడనాడి
వెన్నుడు శ్రీమన్నారాయణుడగు వీరరాఘవుని వేడగదే
బహుబాగు బాగుంది ఈ మీ సంకీర్తన లహరి.
రిప్లయితొలగించండిరాతిని నాతి చేయగలిగిన రాముడే
అదే పాషాణము చే వారధి గట్టి సీత ను రావణ చెఱ విడిపించే
రాఘవాయ మమ నమామి త్వమ్
జగద్రక్షక త్రాహి పాహి పాహి మామ్
~శ్రీత ధరణి