నీవే కద ఈపడవకు నావికుడవు దేవుడా
నీవే కద సకలజగన్నియామకుడవు
ఎన్నెన్ని తుఫానుల నెదురుకొన్న దీపడవ
ఎన్నెన్ని భూఖండము లెన్నిమార్లు చుట్టినదో
ఎన్నెన్ని కుదుపులోర్చి ఇంతదాక నిలచినదో
ఇన్నాళ్ళును రిచ్ఛపడుచు నిదే చూచుచుంటి
పదే పదే నాకు ఓ పడవనడపు విధానము
నిదానముగ నేర్పజూచి నీవు విసిగి కొనవు
వదలక నాపడవ మీద ప్రయాణించుచుందువే
యిది అసలు నీప్రయాణ మేమో యనిపించును
నా పడవను నడపు చున్న నాథుడ వైతేను
నీ పేరే మనుచు నడుగ నేనెంతటి వాడను
నీ పేరు రాముడనుచు నీవే చెప్పికొంటివి
ఈపడవను నాతో రమియించు వాడ వీవే
3, మే 2021, సోమవారం
నీవే కద ఈపడవకు నావికుడవు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
This is 2100th post in this syamaliyam blog, in case any one is interested to note!
రిప్లయితొలగించండిIt is really great to know that you have crossed 2100+ posts in the web logging site. Most of which are dedicated to Lord Rama. People have varied interests ranging from poetry, video logging, diary writing, et cetera., everyone has got the unique talent or have developed a skill that can bridge the gap which can bring about a sea change.
తొలగించండిI have been following every post of yours since the days of bhagavatam, which were explained in very lucid manner. The Rama Keertanas have also got that follow up.
May your journey with words continue and god bless everyone of us.
Thank you, Syamal Rao Sir.
~Sridhar Bukya
అనేక ధన్యవాదాలండీ. మీవంటి సద్భక్తపాఠకుల కోసమే శ్రీరామచంద్రులవారు వ్రాయిస్తున్నారని నమ్ముతున్నాను. అంతా ఆయనదయ, మీబోటి వారి ప్రోత్సాహం తప్ప మరేమీ విశేషం లేదు.
తొలగించండిశ్యామలీయం సార్!
రిప్లయితొలగించండినిజానికి అన్ని కీర్తనలు వ్రాస్తున్నప్పుడు పునరుక్తి వచ్చే అవకాశం చాలా ఉంది.కానీ మీరు పునరుక్తి లేని ఇన్ని కీర్తనల్ని వ్రాయగలగడం అద్భుతమే!
ఈ తరంలో ఇంతటి బృహత్ ప్రయత్నం మొదలు పెట్టడమే గొప్ప!అలాంటిది పట్టు వదలని విక్రమార్కుడిలా 2100 కీర్తనల్ని వ్రాసి కొనసాగిస్తున్నందుకు అందుకోండి మా అభినందనలు.
జై శ్రీ రాం!
హరిగారు, 2100 టపాలండి బ్లాగులో. వాటిలో 1200 దాకా కీర్తనలు.
తొలగించండి