1, జూన్ 2021, మంగళవారం

బాలరాము డటునిటు పరుగులు దీయ

బాలరాము డటునిటు పరుగులు దీయ
చాలముచ్చటగ దోచు సకియ లందరకును

రారా నాకన్నతండ్రి నా రాముడా యని
రారా కొడుకా యని రవికులోత్తమ యని
రారా బంగారుతండ్రి రఘునాయకా యని
కూరిమితో కన్నతల్లి కోసలసుత పిలువ

రారా నాకంటివెలుగ నా రామచంద్ర యని
రారా చిన్నారి దశరథరాముడా యని
రారా ఓ ప్రావృణ్ణీరదశ్యాముడా యని
గారాము చేయుతల్లి కైకమ్మయు పిలువ

కేరింతలు కొట్టుచును కిలకిలకిల నవ్వుచును
చేరబిలుచున్న తల్లుల చేతులలో వ్రాలగ
తూరీగవలె పరుగులువాఱు వాని నడ్డుకొని
రారా కొడుకా యని సుమిత్రామాత ముద్దిడ
2 వ్యాఖ్యలు:

 1. ముగ్గురు తల్లుల మురిపాల బిడ్డ కేళిని ఎంత సరళంగా తెలిపారో...
  బాగుందండి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. భారతి గారు , రామకీర్తనలు చదువుతున్నారన్న మాట. చాలా సంతోషం. మీకూ ఈకీర్తన నచ్నినందుకు మరింత సంతోషం.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.