31, జులై 2020, శుక్రవారం

మిక్కిలి సొగసుకాడు మేటి విలుకాడు


మిక్కిలి సొగసుకాడు మేటి విలుకాడు
నిక్కువమగు కీర్తి ధర నించినవాడు

మిక్కిలి బరువైన విల్లు మోపెట్టినాడు
ముక్కలాయె నంత నది యక్కజము గాను
మిక్కిలి సొగసుకత్తియ మేదినీకన్య
దక్కిన బహుమానమై తగినదాయెను

ఒక్క విల్లెత్తి భార్గవు నొంచి ధృతిమించెను
ఒక్క దర్భశరము పైన నునిచె బ్రహ్మాస్తము
ఒక్క బాణమున గూల్చె నేడుతాళంబు
ఒక్క బాణమున గూల్చె నుధృతుని వాలిని


ముక్కముక్కలుగ చేసి మూలబలము నెల్ల
మిక్కిలి తలలున్నవాని నుక్కడగించెను
చక్కని రామునకు సరిసాటివారు లేరు
మక్కువతో వాని గొప్ప మధురముగ పాడరే

(ఈకీర్తన ఆద్యంతం అప్రయత్నంగా ఏకాక్షర ప్రాసతో‌ నడిచింది!)