20, జులై 2020, సోమవారం

జయజయ జయజయ జయజయ రాం


జయజయ జయజయ జయజయ రాం జయజయ జయజయ సీతారాం
జయజయ త్రిభువనపోషక రాం జయజయ శివనుత సీతారాం

శ్రీరఘునందన సీతారాం తారకనామా సీతారాం
కారణకారణ సీతారాం కౌసల్యాసుత సీతారాం
భూరిదయాపర సీతారాం పురుషోత్తమ హరి సీతారాం
నారాయణ హరి సీతారాం నళినదళేక్షణ సీతారాం

పతితపావన సీతారాం అమితసుగుణమణి సీతారాం
అతులితవిక్రమ సీతారాం అయోధ్యరామా సీతారాం
శ్రుతినుతవైభవ సీతారాం సురగణపూజిత సీతారాం
కృతరావణవధ సీతారాం కిల్బిషనాశన సీతారాం

వాతాత్మజనుత సీతారాం పరమపావన సీతారాం
పూతచరిత్ర సీతారాం భువనేశ్వర హరి సీతారాం
భూతగణేశ్వర సీతారాం పురాణపురుష సీతారాం
సీతారాం జయ సీతారాం సీతారాం హరి సీతారాం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.