5, జులై 2020, ఆదివారం

లేడు లేడంటే రాముడు లేకపోయేనా ఖలులు

లేడు లేడంటే రాముడు లేకపోయేనా ఖలులు
కాడు కాడంటే దేవుడు కాకపోయేనా

వాడు భక్తజనవత్సలడై పరగుచుండు వాడు
వాడు శిష్టజనరక్షకుడై వరలుచుండు వాడు
వాడు దానవాంతకు డనబడుచుండు వాడు
వాడు వెలసి యున్నా డిదే భవతారకుడై

వాడు హరి యన్న పేరుగల వాడాప్తకాముడు
వాడు జగములను సృజియించి పాలించు వాడు
వాడు జీవుల హృత్పద్మముల వసియించు వాడు
వాడు మనవాడై యున్నాడు పరమాప్తుడై

వాడు మన బాగు కోసమై ప్రభవించినాడు
వాడు సీతమ్మ తల్లితో వచ్చియున్నాడు
వాడు సర్వజగద్వంద్యుడై వర్ధిల్లు వాడు
వాడు సనాతను డైన మనవాడు రాముడు