19, జులై 2020, ఆదివారం

జనహితకర శ్రీరామచంద్రమూర్తీ

 జనహితకర శ్రీరామచంద్రమూర్తీ నా
మనసులో నున్న ఓ‌ మహిత మూర్తీ

అందగాడ వనుచు నీకు ముందే పేరు
మందహాసవదనుడ వని మరి యొక పేరు
అందరి వాడ వనుచు నది యొక పేరు
అందుకే‌ నా మానస మది నిను చేరు

వరగుణోపేతుడవగు సరసమూర్తివి
నిరుపమానపరాక్రమాన్విత మూర్తివి
సరిసాటి లేని పరమశాంత మూర్తివి
మరి యందుకె నాకు మనోహర మూర్తివి

నిరంజనా పరంతపా కరుణ చూపరా
మరియాదా పురుషోత్తమ మాటలాడరా
ధరాత్మజా మనోహరా దశరథ రామా
మరి మరి నిన్నే పొగడి మనసు మురియురా