చక్కెర చాలని క్షీరాన్నము చక్కనిది కాదు
తక్కువైనచో భక్తి పూజలో తగిన పూజ కాదు
చిక్కని చక్కని పాలతోను చేసిన ఫలమేమి
చక్కగా ఏలకుల పొడిని చల్లిన ఫలమేమి
ఎక్కువగా కిసిమీసు తగిలించిన ఫలమేమి
వెక్కసంబుగ జీడిపప్పును వేసిన ఫలమేమి
మంచిమంచి హంగులు పేర్చిన మంటపమే చాలా
ఎంచి మంచి పట్టుపుట్టములు ధరించినదే చాలా
పంచభక్ష్యపరమాన్నంబుల పళ్ళెరములు చాలా
అంచితంబుగ నిచ్చిన నక్షత్ర హారతులే చాలా
ఆడంబరమగు పూజలేమి యవసరమే కాదు
చూడడు భక్తిని కాని దేవుడు వీడుడు మూఢతను
వేడుక మీఱ భక్తిపొంగార వెలయించుడు పూజ
నేడే చేయుడు రామపూజను నిజమగు భక్తితో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.