31, జులై 2020, శుక్రవారం

వందనాలు వందనాలు వరలక్ష్మీ‌ (+ఆడియో)


వందనాలు వందనాలు వరలక్ష్మీ‌ జగ
ద్వందిత శుభపాదారవింద లక్ష్మీ

హరి దేవేరివి ఆదిలక్ష్మీ శీఘ్ర
వరదాయిని మా వరలక్ష్మీ
పరమాత్మికా శుభప్రదలక్ష్మీ లోక
పరిపాలనాసద్వ్రతలక్ష్మీ

రావణధ్వంసినీ రామలక్ష్మీ పరమ
పావని శ్రీరామభాగ్యలక్ష్మీ
భావనాగమ్యప్రభావలక్ష్మీ త్రిజగ
దావనగుణశీల అభయలక్ష్మీ

మాధవి రుక్మీణీ‌ మహాలక్ష్మీ భవ
బాధానివారిణి భద్రలక్ష్మీ
సాధుజనానందక జయలక్ష్మీ మా
కాధార మీవే యనంతలక్ష్మీ

ఈ కీర్తనను శ్రీరాగంలో శ్రీ టి.కె,చారి గారి గళంలో వినండి.

3 కామెంట్‌లు:

  1. చాలా బాగుంది కీర్తన 👌👌
    చారి గారు కూడా చాలా బాగా పాడారు 👌👌👌

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలీయం‌ బ్లాగుకు స్వాగతం కస్తూరి సింధూర గారూ. ధన్యవాదాలు. మా చెల్లెళ్ళకు కూడా ఈకీర్తన నచ్చి ఈరోజు వాళ్ళు తమ వ్రతంలో పాడుకున్నామని చెప్పారు. అవునండి చారి గారు చాలా బాగా పాడతారు.

      తొలగించండి
  2. ఈ కీర్తన నడక మరింత సుభగంగా ఉండేటట్లు, చారి గారితో చర్చించి, రెండు చిన్నచిన్న సవరణలు చేసాను.
    వందితపాదారవింద బదులు వందిత శుభపాదారవింద అనీ, సాధుజనప్రియ బదులు సాధుజనానందకరి అనీ.
    మార్పులు గమనించి పాడుకొన గోరుతాను.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.