4, జులై 2020, శనివారం
గోరంత పుణ్యము కొండంత పాపము
గోరంత పుణ్యము కొండంత పాపము
పేరుగొప్ప నరజన్మ పెద్దమోసము
గహనమైన సంగతుల గజిబిజి శాస్త్రాల్లో
విహరించగలేని వాడి కహరహము పాపము
సహనముతో పుణ్యక్రియాచరణుడై యున్నా
యిహమందున పాపస్పర్శ యెందు లేకుండును
పులులు గోవులను తిని పొందవుగా పాపము
తెలియక ఒక మనిషి తింటే దేవుడా పాపమే
పలుచనైన పుణ్యముల ఫలములా స్వల్పము
తెలియని పాపాల వలని తీవ్రశిక్ష లధికము
భూమిని పాపపుణ్యముల గోల పడనేల
రామచంద్రు నమ్ముకొన్న రక్షకలుగును
మీమీ బుధ్ధులను వాడు మిగుల నేర్పుగ నడిపి
స్వామి విడిపించు మిమ్ము జన్మచక్రము నుండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.