1, జులై 2020, బుధవారం

ఘనుడు రాముడు మనవాడుఘనుడు రాముడు మనవాడు కామితవరదుడు మనవాడు
మనవాడండీ‌ మనవాడు మహితాత్ముడు హరి మనవాడు

శ్రీరఘురాముడు మనవాడు హరి సీతారాముడు మనవాడు
సారసనేత్రుడు మనవాడు హరి సాకేతపతి మనవాడు
ధీరుడు శాంతుడు మనవాడు హరి దేవదేవుడు మనవాడు
మారజనకుడు మనవాడు హరి మంగళకరుడు మనవాడు

సర్వమోహనుడు మనవాడు హరి శాంతస్వభావుడు మనవాడు
సర్వాధికుడు మనవాడు హరి జ్ఞానగమ్యుడు మనవాడు
సర్వేశ్వరుడు మనవాడు హరి సర్వజగత్పతి మనవాడు
సర్వవంద్యుడు మనవాడు హరి సర్వమంగళుడు మనవాడు

కరుణాసింధువు మనవాడు హరి కమలానాథుడు మనవాడు
పరమపురుషుడు మనవాడు హరి భక్తవత్సలుడు మనవాడు
విరించివినుతుడు మనవాడు హరి వీరరాఘవుడు మనవాడు
పరమశుభదుడు మనవాడు హరి భవతారకుడు మనవాడు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.