8, జులై 2020, బుధవారం

రాజాధిరాజు శ్రీరామచంద్ర

రాజాధిరాజు శ్రీరామచంద్ర సుర
రాజపూజితాంఘ్రియుగ్మ రామచంద్ర

రమణీయగుణసాంద్ర రామచంద్ర శ్రీ
రమానాయక హరి రామచంద్ర
రమణీయచారిత్ర్య రామచంద్ర శూ
రమణిగణసమర్చిత రామచంద్ర

కామితార్ధదాయక రామచంద్ర శ్రీ
భూమిజామనోహర రామచంద్ర
స్వామి భక్తపాలక రామచంద్ర సు
శ్యామశుభకోమలాంగ రామచంద్ర

సామీరీనుత శ్రీరామచంద్ర సం
గ్రామనిహతరావణ రామచంద్ర
క్షేమసంధాయక రామచంద్ర మా
యామానుషసువేష రామచంద్ర