5, జులై 2020, ఆదివారం

అహరహమును మే మర్చింతుమయా


అహరహమును మే మర్చింతుమయా
ఇహపరములు మా కితడే‌ కాన

చేతల పలుకుల చిత్తమునందున
భూతలనాథుని పుణ్యచరిత్రుని
వీతిహోత్రువలె వెలిగెడు వానిని
సీతాపతినే చేతోముదముగ

హరి వీడే నని యంతరంగమున
మరువక రాముని మహిత చరితుని
కరుణామయుని కలుషాంతకుని
పరిపరి విధముల బాగొప్ప సదా

అత్మీయుని హరి నచ్యుతు దిట్టు దు
రాత్ముల మాటల కలుగక పర
మాత్ముడు రామున కనురాగముతో
నాత్మసమర్పణ మను యజ్ఞంబున