20, జులై 2020, సోమవారం

రామ రామ తప్పాయె రక్షించవయ్యె


రామ రామ తప్పాయె రక్షించవయ్యె
ఏమాత్ర మిద్ది యూహించ నైతి

ఒకరీతిగా వ్రాయ నింకొక రీతిగా నెఱిగి
యొకరు చేసిన మార్పు నోపగ లేక
వికలమాయె మనసు వివరించ లేనింక
సకల మెఱిగిన రామచంద్ర మూర్తీ

నిను గాక నన్యుల కనుచు దండంబులు
వినవయ్య యేనాడు పెట్టనేరనుగ
యనుకోని పొరపాటు ననుజేసి దొరలెనే
యను తాపమొక్కటి యధిక మాయె

అపచారమే యని యనుకొందువో
యపరాధి వీడాయె ననుకొందువో
విపరీత మాయెనని కపటినైపోతినని
తపియించు నాపైన దయజూపుము


3 కామెంట్‌లు:

  1. మొన్ననీ మధ్య ఏదో సందర్భంగా అనుకున్నవిషయం కి అనుకోకుండా లింక్ దొరికింది చూడండి.
    https://mottikaayalu.blogspot.com/2014/12/blog-post_8.html

    అయ్యో జాన్ గారు ఎందుకు ఇలా ..

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.