రామభక్తుడే వాడు రామభక్తుడే శ్రీ
రాముడు కరుణించదగిన లక్షణయుతుడే
రాముడు కరుణించదగిన లక్షణయుతుడే
రామ రామ రామ యనగ రామనామమును వినుచు
రామ రామ రామ యనగ రక్తి కలిగెనా
రామనామ మాధుర్యము భూమి నపూర్వముగ దోచ
రామ రామ రామ యనగ రక్తి కలిగెనా
రాముని రూపమ్ము నెంచి రాముని శాంతమ్ము నెంచి
రాముని సేవించుటకై రక్తి కలిగెనా
రాముని సద్గుణము నెంచి రాముని సచ్చరిత మెంచి
రామునిపై సేవించుటకై రక్తి కలిగెనా
రామునిపై సేవించుటకై రక్తి కలిగెనా
రాముని సత్యమ్ము నెంచి రాముని సత్కరుణ నెంచి
రాముని చింతించుటలో రక్తి కలిగెనా
రాముని తత్త్వమ్ము నెంచి రాముని ధర్మమ్ము నెంచి
రాముని చింతించుటలో రక్తి కలిగెనా