రామనామమా నన్ను రక్షించుమా ఇంక
ఆమోక్షపదము నా కందించుమా
వచ్చి నానాలుకపై నిచ్చలు నివసింపవే
హెచ్చు ప్రేమతో నినుస్మరించుచుందునే
పిచ్చిపిచ్చి ధనములను వేడుటలేదే నిన్నుముచ్చటగా కోరుదునే ముక్తి యొక్కటే
కోరరాని వేమి నిన్ను కోరుటలేదే నేను
నోరు విడచి మోక్షమొకటె కోరుచుంటినే
భూరికృపతోడ నన్ను బ్రోవవలయునే సం
సారమందు నిలువగా జాలను సూవె
నారామనామమనుచు నమ్ముకొంటినే మన
సారా జిహ్వాగ్రమందు గారవింతునే
కారుణ్యము చూపి నన్ను కావవలయునే ఈ
ధారుణిపై మరలపుట్టు తలపేలేదే
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.