23, మార్చి 2023, గురువారం

హరి నీవాడైతే అది నీగొప్ప

హరి నీవాడైతే అది నీగొప్ప ఆ
హరి నావాడైతే అది నాగొప్ప 
 
హరి యందరి వాడైతే అది హరి గొప్ప అని
హరి గొప్ప నెఱుగుటే నరులకు గొప్ప
నరులలో తమవాడగు హరి యందనురక్తి
కర మధికమైన వాని చరితము గొప్ప

హరి లీలల నెఱిగితివా హరి నీవాడు ఆ
హరి చరితము లెఱిగితివా హరి నీవాడు
హరి భక్తుల జేరితివా హరి నీవాడు ఇక
హరికి శరణ మంటివా హరి నీవాడు

హరే రామ యంటివా హరి నీవాడు శ్రీ
హరే కృష్ణ యంటివా హరి నీవాడు
హరే రామ యంటి నా హరి నావాడు శ్రీ
హరే కృష్ణ యంటి నా హరి నావాడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.