విందురో భూజనులు వినము పొమ్మందురో
యిందీవరాక్ష నాకెందుకయ్యా రామ
ఏడాది కొకసారి యెంచి నిన్ను దలంచి
వేడుకలు చేయుటే విధమను కొనువారు
వాడుకగ నాపాట పట్టించుకొనకున్న
వేడుకొన నేమిటికి వినుడనుచు వారిని
నిత్యమును వినుచున్న నీకు వినిపించెదను
సత్యమిది యిదియేను సద్వ్రతంబగు నాకు
భృత్యుడను నీకీర్తి విరివిగా చాటుటే
కృత్యమని పాడుదును సత్యపరాక్రముడ
విని సంతసించినను వేడ్కతో పాడినను
మనుజులకు శుభవృష్టి మహిని కల్గును కాని
మనసులేని జనులు మరి యెట్టులున్నను
వినవయ్య నాకేల వింతవికారమ్ము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.