రారా రారా రామ రమణీయగుణధామ
ధారా ధరశ్యామ దయతో నన్నేల
సురలు కోరగ నీవు సొంపుగ వైకుంఠ
పురము వీడి ధరకు నరుదెంచు టనగ
నరులకు సొంపైన నడవడి బోధింప
కరుణతో తలపోసి కాదా శ్రీరామ
తరణి కులము జొచ్చి ధరణిజను చేపట్టి
చొరరాని యడవుల జొచ్చి రక్కసుల
పరిమార్చి లంకపై బడి రావణుని జంపి
సురకార్యమును దీర్చి శోభించినావు
హనుమద్విభీషణుల నతిప్రేమతో నేలి
నిను నమ్మితేచాలు ననిచాటి నావు
నిను నమ్మితిని నేను నిండారు ప్రేమతో
నను గూడ రక్షించ జననాధ రామ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.