రావే రావే బాణమా రామబాణమా ఈ
రావణుని గుండెలను బ్రద్దలుచేయ
అమరుడ కావలెనని యాశపడెను రావణుడు
అమరుడ కాలేననుచు నాగ్రహించె రావణుడు
అమరుల సాధించ చాల ఆటలాడె రావణుడు
అమరుల పీడించి నందు కనుభవించ శిక్ష
వనితల పెక్కండ్రపైన భ్రాంతిపడెను రావణుడు
వనితల శోకింపజేసి వినోదించె రావణుడు
వనితల పీడించి శాపమును బొందెను రావణుడు
వనితల పగదీరగ నేడనుభవించ శిక్ష
మునుల యాగములు ధ్వంసమొనరించెను రావణుడు
మునులజంపి పచ్చిమాంసమును తినెను రావణుడు
మునుల పరువెత్తజేసి వినోదించె రావణుడు
మునుల యుసురు తగిలి నే డనుభవించ శిక్ష
// “ మునులజంపి పచ్చిమాంసమును తినెను రావణుడు” //
రిప్లయితొలగించండిమునుల యాగాలను ధ్వంసం చేయించాడు నిజమే కానీ పచ్చి నరమాంసం తినేవాడంటారా రావణుడు ? రాక్షసుడయినప్పటికీ రావణుడు గొప్ప పండితుడు అంటారు కదా.
రావణుడు నరమాంసం తినేవాడనడం రామాయణంలో పేర్కొనబడిందంటారా?
ఈవిధంగా ఉత్తరరామాయణంలో ఉందండీ.
తొలగించండిఅందుకే కాబోలు,నేను చెప్పిన గడువు లోపల నీ అంతత నువ్వు మనస్సు మళ్ళించుకుని నన్ను వరించు,లేదంటే ప్రాతఃకాల భోజనం చేస్తానన్నాడు సీతతో!
తొలగించండి