13, ఏప్రిల్ 2019, శనివారం
ఒకరి జేరగ నేల నొకమాట పడనేల
ఒకరి జేరగ నేల నొకమాట పడనేల
నొకసారి చిత్తమా యోచించవే
అన్నిట తోడైనవాడు అభయ మిచ్చు వాడు
వెన్పంటి యున్నవాడు విష్ణుదేవుడు
నిన్ను కాచుచుండగ నీకేల నితరుల
నెన్ని చేరవలసెనో యిన్ని నాళ్ళకు
చేయి నందించువాడు చింత తీర్చువాడు
హాయిగొల్పు తీరువా డాదిదేవుడు
నీ యోగక్షేమముల నిత్యమారయగను
పోయి నీకేల పరుల పొంద నిప్పుడు
శ్రీరాముడను వాడు చెంత నున్న వాడు
తీరుగ మోక్షమిచ్చు దేవదేవుడు
కోరిన కోర్కులెల్ల కురియు నేమిటికి
ధారుణి సామాన్యుల తలప నిప్పుడు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
శ్రీరామపత్ని జనకజ
రిప్లయితొలగించండిగారాముల భూమిపుత్రి కమనీయ దయా
వారాశి సీత సతియై
శ్రీరాముని నామ మహిమ శ్రీకరమయ్యెన్ .
శ్రీరామబంటు అంజన
గారాముల కూర్మిసుతుడు కరుణాంబుధి శ్రీ
మారుతి భజియించి కొలువ
శ్రీరాముని నామ మహిమ శ్రీకరమయ్యెన్ .
రామనవమి శుభాకాంక్షలు .