22, నవంబర్ 2020, ఆదివారం

తప్పులను మన్నించుము

తప్పులను మన్నించుము దశరథరామ నేను

తప్పక నీవాడ గద దశరథరామ


తప్పులెన్ని పెద్దలనే దశరథరామ నేను

తప్పులనే చేసినాను దశరథరామ

తప్పక నే దండ్యుడనే దశరథరామ యిట్టి

తప్పు లింక చేయనయ్య దశరథరామ


ధరను మనుజజాతికి దశరథరామ యిదే

తరణోపాయ మనుచు దశరథరామ  

తరచు నామస్మరణమునే దశరథరామ మరచు

తరళితాంతరంగుడను దశరథరామ


విశదయశుడ వీవయ్య దశరథరామ పాప

ప్రశమనైక నాముడవని దశరథరామ

దిశలన్నిట నీతేజము దశరథరామ నిండ

కుశలమె నీవారి కెపుడు దశరథరామ


1 కామెంట్‌:

  1. కొన్ని సార్లు మనకు మనమే సర్ది చెప్పుకోవాలి
    మరిన్ని సార్లు మనకు మనమే సంజాయిషి ఇచ్చుకోవాలి
    చేయని తప్పునకు బాధ్యత వహిస్తే
    చేసిన ఒప్పులకు తిలోదకాలిచ్చినట్టే

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.