8, ఏప్రిల్ 2013, సోమవారం

పాహి రామప్రభో - 071

శా. తీయందీయని వాగ్విలాసముల స్వాధిష్ఠాన పద్మంబునన్
మాయాతీతుడు రామచంద్రుడదె బ్రహ్మాకారముం దాల్చి వా

ణీ యుక్తుండును నిత్యమంగళకరుం డీశుండునై తారకుం
డై యొప్పారు బలాంతవర్ణసహితుండై సద్గురుండై కృపన్

(వ్రాసిన తేదీ: 2013-2-3)

4 వ్యాఖ్యలు:

 1. ఇవి చదువుతూంటే కళ్లమ్మట నీళ్ళు కారుతున్నాయి. ఇలా ఏడిపించడానికి మీకు అధికారం ఎవరిచ్చారు? రేపో ఎప్పుడో రాముడ్ని అడిగి ఇంకో పద్యంలో చెప్పగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. డీ జీ గారికి
  రాముల వారి జవాబు

  ఏడ్చే వాళ్ళంటే నాకు నచ్చదు బీ బ్రేవ్ !

  రామో నర శార్దూలః !

  రామ భక్తులు కూడా నర శార్దూలా లై ఉండాలి , సొ బీ బ్రేవ్ !

  జిలేబి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఆనంద బాష్పాలండీ అవి. జిలేబీ తింటూంటే వస్తాయి చూడండి. అలాంటివి అన్న మాట. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మీలో‌ మీరే మంచి సంభాషణ చేసుకున్నారు. సంతోషం. నేను చెప్పవలసింది యేమీ‌లేదు ప్రత్యేకంగా.

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.