మారాము డున్నాడు మాకేమి భయము
శ్రీరాము డున్నాడు సిధ్ధము జయము
మునినాథులు మెచ్చుకున్న జననాథుండైన
జననాథుల కులములోన సర్వోత్తముడైన
సునిశితబాణంబు లున్న మొనగాడై యున్న
మొనల రేగి దనుజుల నాశనము చేసి యున్న
భక్తవరుల కందరకును ముక్తి నిచ్చు చున్న
ముక్తి దక్క వేడని మమ్మొప్పుగ రక్షించే
మత్త కోకిల అని మీరు చెబితే మత్తు కోక్ అని జిలేబి మార్చింది. ఆ వెకిలి స్వభావం ఇక మారదు .
రిప్లయితొలగించండిశర్మ గారికి జిలేబీ వెర్రి వ్యాఖ్యలు ఇష్టమే.
హద్దుల్లో ఉంటేనే
తొలగించండిముద్దన్నది తెలియలేని మొద్దుజిలేబీ
వద్దంటే వింటుందా
వద్దిక తనతోడ మనకు వాదాలేలా
అత్యుత్సాహంతో ఏవో రచనలు చేయడమే కాక అచ్చు వేసుకోవడం తెలుగు రచయితల బలహీనత. వాటిని రచయిత ఇంట్లో వాళ్ళు కూడా చదవరు. బలవంతంగా స్నేహితులకు బంధువులకు కాపీలు ఇవ్వడం. అవి చదివే ఆసక్తి ఓపిక ఎవరికీ ఉండదు.
రిప్లయితొలగించండివేల కాపీలు చివరికి పాత పుస్తకాలు, పేపర్లు కొనేవారికి ఇవ్వడం.
ఇవన్నీ చేయడం కంటే స్వయంగా కావ్య దహనోత్సవం చేసుకోవడం నయం.
మునుకొని ధనదహనంబన
తొలగించండితన పుస్తక మచ్చువేసి తత్ప్రతుల తుదిన్
ఘనముగ దహియింపక కల
మును తొల్లి దహించు టొప్పు భూమిన్ కవికిన్