21, ఫిబ్రవరి 2026, శనివారం

సేవకులము

మేము రామచంద్రసార్వభౌముని సేవకులము
మేము రామవిభునియాన నేమాత్రము మీరము

రామమంత్ర మొకటి దక్క మేముపాసించము
రామచరిత మొకటి దక్క మేము పఠియించము
రామభక్తవరుల దక్క మేము చేరబోము
రామ సేవలను దక్క మేము చేయబోము

రాముని వైభవము దక్క మేము కీర్తించము
రాముని పాదముల గాక మేమన్యము మ్రొక్కము
రాముని సత్కృపను గాక మేమన్యము కోరము
రాముని సన్నిధిని గాక మేమన్యము నొల్లము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు. అజ్ఞాతల వ్యాఖ్యలు ప్రచురించబడవు