11, ఫిబ్రవరి 2026, బుధవారం

నా పరిస్థితి.

మూడవ తారీఖున ఉదయం రోడ్ దాటుతుంటే స్కూటరు వచ్చి తాకి పడ్డాను. కొంచెం కముకుదెబ్బలు తగిలాయి. మాచెల్లెళ్ళు వచ్చి లాక్కుపోయారు. నాతల్లులు  వాళ్ళే నాసంరక్షణ చూస్తున్నారు శారద గతించినప్పటి నుండీ.


ఇపుడు వాళ్ళ ఇంటికి సమీపంలోనికి నన్ను మార్చాలని వాళ్ళ తీర్మానం. రెండునెలల క్రితం ఇంట్లోనే పడిపోయాను కదా. ఇపు డిది. ఇక నన్ను ఒక్కడినే బయట తిగుగనీయ వద్దని కూడా తీర్మానించారు.


శారద వెళ్ళపోయాక కొంచెం మానసికంగా దెబ్బతినటం వలన ఈఫరిస్థితి వవ్చిందేమో అని నా అనుమానం.


మొదట కొంత కులాసాగానే ఉన్నాను. మందులు వాడుతున్నాను.


క్రమంగా రెండడుగులు ముందుకూ మూడడుగలు వెనక్కీ అన్నట్లుంది నా పరిస్థితి. మందులు ఇంకా వాడుతున్నాను. మొదట కుడిచేతి x - ray తీయించారు. అది బాగుంది. కాని నొప్పులు బాగానే ఉన్నాయి. 


కాలిపరిస్థితి అంత మెరుగుకాలేదే అని డాక్టరును కలిసి మాట్లాడాము. నిన్న x- ray తీస్తే కొంచెం fracture ఉందని అన్నాడు technician. 


నిన్న మాబావగారు నా రిపోర్టులతో డాక్టరును కలిసారు. డాక్టర్ నాతో కూడా ఫోనులో మాట్లాడారు. 


కుడిమోకాలికీ పాదానికీ మధ్యభాగంలో కుడివైపున చిన్న hairline fracture అన్నారు.


ఒక ఐదారువారాలు బెడ్ రెష్ట్ అవసరం అన్నారు. మాచెల్లెలు లక్ష్మి యింట్లో ఉన్నాను.


2 కామెంట్‌లు:

  1. ఓహ్ :(

    hairline fracture కదా ఏం పర్లేదు లెండి.. కంగారు పడకండి ... మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ముందు ... కాల్షియం ఉండే ఆహారం తీసుకోండి ..

    పాజిటివ్ గా ఉండండి...

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు. అజ్ఞాతల వ్యాఖ్యలు ప్రచురించబడవు