న్నారాయణ నారాయణ నారాయణా
వారిధిలో మత్స్యమవై నారాయణా వేద
చోరుని వధియించినట్టి నారాయణా
వారాన్నిధి కూర్మమవై నారాయణా కొండ
నారూఢిగ మోసినట్టి నారాయణా
భూరివరాహాకృతివై నారాయణా ధరను
కోర నెత్తి కాచి నట్టి నారాయణా
ఘోరు హేమకశిపు గోళ్ళ నారాయణా చీరి
వైరి బాలు గాచి నట్టి నారాయణా
చేరి చిన్ని వడుగువై నారాయణా దాన
వీరుని బలి నణచినట్టి నారాయణా
ధారుణి రాజులను జంప నారాయణా రేగి
ఘోరపరశురాముడ వగు నారాయణా
క్రూరుడు రావణుని జంప నారాయణా ధరణి
శ్రీరాముడవైన యట్టి నారాయణా
కౌరవకులవిధ్వంసన నారాయణా భూమి
భారము నణగించి నట్టి నారాయణా
మారశతాకార బుధ్ధ నారాయణా దైత్య
నారీజనహృదయచోర నారాయణా
వీర కల్కి రూపముతో నారాయణా పొడమి
దారుణ కలిమాయ నణచు నారాయణా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.