చిక్కని నాటకము
మిక్కిలి నేర్పుతో మెలగుచు బ్రహ్మయ్య
చక్కగ నడిపించు స్వామి రచించిన
ఎన్నెన్నో పాత్రల వన్నియు తిన్నగ
వెన్నుని యానతి నెన్ని నటించెడు
చిన్నచిన్న కథలు చిక్కుముడుల కథలు
ఎన్నో పెద్దకథలు నెన్నెన్నో మళుపుల
ఆడించు వానికిని యాడు వారలకును
కూడ తన పోకడల గూర్చియే తెలియని
ఆడించునది వాడె ఆట యంతయు వాడె
యాడుచున్నది వాడె అన్నిపాత్రల దూరి
మొన్న రాముడై వాడె నిన్న కృష్ణుడై వాడె
తిన్నగ జొరబడి మిన్నగ నడిపిన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు. అజ్ఞాతల వ్యాఖ్యలు ప్రచురించబడవు