నట్టి నేస్తుడా నా
చేయిబట్టి నడిపించే
శ్రీరాముడా
యుగము లెన్ని గడచినను
జగము లెన్ని తిరిగినను
పగలురేలు నీధ్యాసనే
తగిలియుందు నిజముగ
మాయెమాయె జాయ యంటె
మాయలోన పడ కంటివి
మాయజేసే వారెవ రన
హాయిగ నిదె నవ్వితివి
నాయిల్లిది కాదనుచో
నేయిల్లన మాట్లాడవు
నీయింటికి పిలిచెదవా
ఆయూసే నీవెత్తవు
కలలలోన తోచెదవు
గలగల మాట్లాడెదవు
పిలుచు టెపుడు నన్నంటే
పలుకకుండ పోయెదవు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు. అజ్ఞాతల వ్యాఖ్యలు ప్రచురించబడవు