రారా రాఘవ నను దరిజేర్చగ
శ్రీరామా నీభక్తుడరా
రారా ఘనసంసారమహార్ణవ
తారణకారణ శ్రీరామా
శ్రితజనపోషక శ్రీరామా
కారుణ్యాలయ కమలదళేక్షణ
కామితవరదా శ్రీరామా
శూరజనేశ్వర వైరిజనాంతక
సురగణతోషణ శ్రీరామా
వారిజలోచన బంధవిమోచన
భవభయశోషణ శ్రీరామా
తామరసేక్షణ దశరథనందన
దనుజవిమర్దన శ్రీరామా
భూమిసుతావర భూపాలోత్తమ
పుణ్యవివర్ధన శ్రీరామా
కోమలాంగ సుశ్యామలాంగ సు
త్రామప్రశంసిత శ్రీరామా
కామారిస్తుత కమలజసంస్తుత
కారణకారణ శ్రీరామా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.