28, ఫిబ్రవరి 2026, శనివారం

మేము నినే

మేము నినే నమ్మి యున్నాము రాముడా నీ
నామమునే పలుకుచున్నాము రాముడా

మునిరాజులు కీర్తించు మోహనాంగుడా
దనుజదుష్టగర్వవిదార రాముడా

కామితములు భక్తులకు కరువుతీరగా
ప్రేమతోడ సదావర్షించు రాముడా

భవతారకనామ రామ పరమవీరుడా
శివవిరించిశక్రనుతశీల రాముడా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు. అజ్ఞాతల వ్యాఖ్యలు ప్రచురించబడవు