23, ఫిబ్రవరి 2026, సోమవారం

రామనామ మొకటె

రామనామ మొకటె మంత్రరాజ మనుచు తెలియుడీ
ఆమంత్రము భవతారక మన్న మాట తెలియుడీ

చక్కగాను శ్రీరాముని చరితమునే చదువుడీ
మ్రొక్కవోని భక్తి రామమూర్తి పైన నిలుపుడీ
నిక్కముగా భక్తి తక్క నియమము లే దెఱుగుడీ
ఒక్క యీ మంత్రమునే యుపాసన చేయుడీ

మక్కువతో రసన కీమంత్రమునే మప్పుడీ
నిక్కమైన భక్తితోడ నిరంతరము పలుకుడీ
తక్కుంగల మంత్రములకు తహతహలు పడకుడీ
చక్కగాను మోక్షమునే సాధించుకొనుడీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు. అజ్ఞాతల వ్యాఖ్యలు ప్రచురించబడవు